శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజధాని గ్రామాల్లో మహిళలు అమరావతినే నవ్యాంధ్రకు క్యాపిటల్‌గా ఉంచాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలోని పవిత్ర మట్టి వద్ద పూజలు చేశారు. అమరావతికి ద్రోహం చేసిన వారికి మందడంలో మహిళలు పూలు, గాజులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజధానితో తమకు సంబంధం లేదన్నభాజపా నేతల వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తమను ఎదురుగా పొడిస్తే భాజపా వెన్నుపోటు పొడిచిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి ఏం సంబంధం లేనప్పుడు 2వేల 5 వందల కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
రాజధానిలో మహిళల ప్రత్యేక పూజలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని రాజధాని గ్రామాల్లోని మహిళలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కేంద్రం...రాజధాని ఎంపిక విషయంలో ఎందుకు పక్కకు తప్పుకుందో తమకు స్పష్టమైన సమాధానమివ్వాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు.
అమరావతినే నవ్యాంధ్రకు క్యాపిటల్‌గా ఉంచాలని రాజధానిలో మహిళల ప్రత్యేక పూజలు