అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో.. మూడో రోజు శ్రీవిద్యా మహాయాగం ఘనంగా నిర్వహించారు యాగంలో భాగంగా శ్రీచక్ర కుంకుమార్చన పూజలు చేశారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి యాగంలో పాల్గొన్నారు. రాజధాని మహిళలు శ్రీచక్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని సంకల్ప సిద్ధి చేశారు.
అమరావతే రాజధాని ధ్యేయంగా... శ్రీ విద్యా మహాయాగం - అమరావతి కోసం యాగం అప్డేట్
అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ.. నిర్వహిస్తున్న శ్రీ విద్యా మహాయాగం మూడో రోజు ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ యాగంలో రాజధాని మహిళలు పాల్గొన్నారు.
అమరావతే రాజధాని ధ్యేయంగా... శ్రీ విద్యా మహాయాగం నిర్వహణ
TAGGED:
అమరావతి కోసం యాగం