రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చర్చిలో పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తారనుకుంటే... ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాసన మండలి రద్దు చేస్తూ జగన్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి రద్దు చేసిన చేతితోనే అసెంబ్లీని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాజధానిపై సీఎం మనసు మారాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు - ఎర్రబాలెంలో సీఎం మనసు మారాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
రాజధానిపై ముఖ్యమంత్రి మనసు మార్చాలని గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో రైతులు, మహిళలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాసన మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
![రాజధానిపై సీఎం మనసు మారాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు Special prayers in the church to change the mind of the CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5858950-199-5858950-1580118760820.jpg)
ఎర్రబాలెంలో సీఎం మనసు మారాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
ఎర్రబాలెంలో సీఎం మనసు మారాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు