స్వాతంత్ర సాధన కోసం ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను అర్పించారని రాష్ట్ర హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. ప్రపంచంలో భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. మొదటిసారిగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన... పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. శనివారం సైతం లీగల్ సెల్ లో న్యాయవాదులు, సిబ్బంది బాధ్యతలు నిర్వహించి నిబద్ధతను చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సౌకర్యాల లేమి ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా బాధ్యతలను నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు.
గుంటూరు శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూలులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ స్పూర్తితో దేశాభివద్ధికి అందరూ కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.