గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్‌లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నరసరావుపేట వెంగళరెడ్డి నగర్‌కు చెందిన లోమడ మాల్యాద్రి అలియాస్ చంటి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆటోతోపాటు అందులో ఉన్న 60 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబీ అధికారులు తెలిపారు. ఆ సరకు విలువ రూ.75వేలు ఉంటుందని అంచనా వేశారు.
SEIZED: తెలంగాణ మద్యం స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - Telangana liquor seized in Chilakaluripeta
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో 75 వేలు విలువ చేసే 60 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
![SEIZED: తెలంగాణ మద్యం స్వాధీనం.. ఒకరు అరెస్ట్ Telangana liquor seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12673512-192-12673512-1628084190296.jpg)
తెలంగాణ మద్యం స్వాధీనం