ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దసరా హోరు.. వాహన విక్రయాల జోరు

By

Published : Oct 25, 2020, 8:10 PM IST

దసరా పర్వదినాల వాహన విక్రయాలు జోరందుకున్నాయి. లాక్ డౌన్ సంక్షోభం తర్వాత రెండు నెలల నుంచి వాహన మార్కెట్ పుంజుకున్న నేపథ్యంలో.. విజయదశమి పండుగ మరింత సందడి తెచ్చింది. కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ షోరూమ్​లు కళకళలాడుతున్నాయి.

automobile industry speedup
దసరా హోరు.. వాహన విక్రయాల జోరు

కరోనా ప్రభావం అన్నిరంగాలపైనా పడినట్లే.. ఆటోమొబైల్ రంగంపైనా 5 నెలలపాటు తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. అన్​లాక్ ప్రక్రియ వచ్చాక మెల్లగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవటంతో.. ప్రజలు సొంత వాహనాలపై దృష్టి మళ్లిస్తున్నారు. మరోవైపు అందరిలోనూ కరోనాపై అవగాహన పెరిగింది. ఇదే అదనుగా చాలామంది సెకండ్ హ్యాండ్ బైకులు, కార్ల వైపు మొగ్గుచూపారు. కొత్త వాహనాలకూ డిమాండ్ పెరిగింది. ప్రైవేటు, ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు ఫైనాన్సు తీసుకుని మరీ వాహనాలు కొంటున్నారు. డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లకు దరిదాపుల్లోకి రావటంతో ఎక్కువమంది పెట్రోల్ వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. బీఎస్-6 వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నందున కొనుగోలుదార్లలో ఆసక్తి పెరిగింది.

తక్కువ డౌన్​పేమెంట్

కారు కొనుగోలుకు రూ. 90 వేల నుంచి లక్ష రూపాయలు, ద్విచక్రవాహనాలకైతే రూ. 15 నుంచి రూ. 20వేల డౌన్ పేమెంట్​తో చాలా కంపెనీలు వాహనాలు విక్రయిస్తున్నాయి. బ్యాంకులు, ఫైనాన్సు సంస్థల నుంచి సులభతరంగా రుణాలు లభిస్తున్నందున ఆటోమొబైల్ రంగం మిగతా వాటికంటే వేగంగా పుంజుకుంది. చాలా కంపెనీలు గత ఏడాది కంటే వాహనాల కొనుగోలుపై రూ. 10 వేల నుంచి రూ. 50వేల వరకు ఆపర్లు పెట్టటంతో వాహనాల కొనుగోలుకు ఇదే మంచి తరుణమని వినియోగదారులు భావిస్తున్నారు.

లాక్ డౌన్ తర్వాత రెండు నెలలుగా మార్కెట్ పుంజుకుందని.. వాహనాలు కొనాలనుకున్నవారికి ఇది మంచి సమయమని అమ్మకందారులు చెప్తున్నారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ ఆటో మొబైల్ రంగం గాడినపడటం అటు మార్కెటింగ్ వర్గాలను, ఇటు సామాన్య ప్రజలను ఉత్సహపరుస్తోంది.

ఇవీ చదవండి..

ఉత్తరాంధ్ర సత్యం గల తల్లి...ఎరుకుమాంబ

ABOUT THE AUTHOR

...view details