ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పాఠశాలలు తెరవాలా వద్దా అన్న ఆలోచనలో ప్రభుత్వం'

By

Published : Aug 27, 2020, 5:50 PM IST

కరోనా కారణంగా పాఠశాలలు తెరవాలా వద్దా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని శ్రీ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Speaker Tammineni sitaram comments on schools reopen in AP
సభాపతి తమ్మినేని సీతారాం

సభాపతి తమ్మినేని సీతారాం

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ వంటి అరుదైన దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్లు విశ్వసిస్తారని చెప్పారు. పురాణాలు నమ్మేవారికి ఈ చారిత్రక దేవాలయాలు నిదర్శనమని వివరించారు.

అనంతరం శ్రీ భూసమేత రంగనాథస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, గంగా పార్వతీసమేత నాగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాఠశాలలు తెరిచే విషయమై స్పందించారు. కరోనా నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచనలో ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details