ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిలుస్తోంది కోటప్పకొండ

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సభాపతి సూచించారు. బుధవారం నాడు నరసరావుపేట మండలం కోటప్పకొండలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సభాపతి కోడెల సమీక్ష

By

Published : Feb 21, 2019, 3:10 AM IST

Updated : Feb 21, 2019, 9:40 AM IST

కోటప్పకొండ ఉత్సవాలపై సభాపతి సమీక్ష

సభాపతి కోడెల నిర్వహించిన సమీక్ష సమావేశానికి నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మొత్తం 46 శాఖల అధికారులు పాల్గొన్నారు. పండుగకు రెండ్రోజులమందుగానే సాగర్ జలాలు కొటప్పకొండకు వచ్చేలా చూడాలని అధికారులకు కోడెల శివప్రసాద్​ సూచించారు. మహాశివరాత్రి తిరునాళ్ళను విజయవంతం చేయాలన్నారు.

కోటప్పకొండ ఉత్సవాలపై సభాపతి సమీక్ష

పోలీస్ బందోబస్తు, ప్రభుత్వ స్టాల్స్, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక, ఆహార భద్రత, విద్యుత్తు, అటవీ, దేవాదాయ శాఖాధికారులతో మాట్లాడారు. పనుల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఆరా తీశారు. గతేడాది రావల్సిన 30 లక్షలు, ఈ ఏడాది రానున్న30 లక్షలను దేవస్థాన ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిందిగా ఈవో బైరాగికి సూచించారు. నిధుల బకాయిలు ఉన్న శాఖలు ఆర్డీవోకు తెలపాలని సభాపతి చెప్పారు. ఈనెల 27న మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

Last Updated : Feb 21, 2019, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details