ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పేరుతో పీఏ ఎవరూ లేరు: తమ్మినేని - news updates of speaker thammineni seetharam

శాసనసభాపతి పీఏ అంటూ సోమేశ్వరరావు చేస్తున్న మోసాలపై స్పీకర్ కార్యాలయం విచారించింది. సోమేశ్వరరావు అనే పేరుతో తన పీఏ ఎవరూ లేరంటూ... అతని ప్రలోభాలకు గురి కావద్దంటూ సభాపతి తమ్మినేని స్పష్టం చేశారు.

speaker office investigates of someshwararao frauds
సభాపతి తమ్మినేని సీతారాం

By

Published : Sep 10, 2020, 10:49 PM IST

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏ అంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి చేస్తున్న మోసాలపై సభాపతి కార్యాలయం విచారించింది. సోమేశ్వరరావు పేరుతో సభాపతి పీఏ ఎవరూ లేరంటూ... అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ప్రకటన విడుదల చేశారు. సోమేశ్వరరావు నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించుకుని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలువురిని మోసగిస్తున్నారని తెలిపారు. అతని ప్రలోభాలకు ఎవరూ గురికావద్దని సభాపతి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details