తన పాటలతో ఎందరినో చైతన్యవంతులుగా చేసిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని తెదేపా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు.
గుంటూరు లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. నేతలు బాలును స్మరించుకున్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు.