గుంటూరు జిల్లా నరసరావుపేటలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఎస్పీ కార్యాలయం కోసం స్థలాలను పరిశీలించారు. నరసరావుపేట జిల్లా ప్రతిపాదనలో భాగంగా పట్టణంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎన్నెస్పీ కార్యాలయం ప్రాంగణంలోని ఎన్నెస్పీ నూతన బిల్డింగ్ లను పరిశీలించారు. వాటితో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎన్నెస్పీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహాలను పర్యవేక్షించారు. అనంతరం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట పోలీస్ అధికారులతో సమావేశమై వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి, ఒకటో పట్టణ, గ్రామీణ పోలీసులు పాల్గొన్నారు.
నరసరావుపేటలో ఎస్పీ విశాల్ గున్ని పర్యటన - నరసరావుపేటలో ఎస్పీ విశాల్ గున్ని పర్యటన తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పర్యటించారు. ఎస్పీ కార్యాలయం కోసం స్థలాల పరిశీలన చేశారు.
నరసరావుపేటలో ఎస్పీ విశాల్ గున్ని పర్యటన
ఇదీ చూడండి.
బుడా పరిధిలో మరో 169 గ్రామపంచాయతీలు విలీనం
TAGGED:
Narasaraopet updates