ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని ఆంక్షలు విధించలేదు: ఎస్పీ - కోటప్పకొండ తిరునాళ్లు తాజా వార్తలు

గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దన్న ప్రచారంపై.. ఎస్పీ విశాల్‌ గున్నీ స్పందించారు. దానిపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని మేం ఆంక్షలు విధించలేదు: ఎస్పీ
కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని మేం ఆంక్షలు విధించలేదు: ఎస్పీ

By

Published : Feb 28, 2021, 5:37 PM IST

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని ఆంక్షలు విధించలేదని.. ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సంప్రదాయ ప్రభలపై ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరునాళ్లు జరుపుకోవచ్చని తెలిపారు. మతాచారాలకు సంబంధించి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details