గుంటూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గిన్నీ తెలిపారు. జిల్లాలో నాలుగో విడత ఎన్నికలు సంతృప్తికరంగా సాగాయని.. సత్తెనపల్లిలోని ఎన్ఎస్పీ బంగ్లాలో వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా.. ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఓటర్ల విజయమేనన్నారు.
'అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే సహించం' - ఈరోజు ఎన్నికలపై గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గిన్నీ వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గిన్నీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. నాలుగో విడత ఎన్నికలు సంతృప్తికరంగా సాగాయన్న ఆయన ఫలితాలు అనంతరం అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఫిరంగిపురం, అమరావతి, పెదకూరపాడు, సత్తెనపల్లిలలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో కానీ ముగిసిన అనంతరం కానీ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ హెచ్చరించారు.
ఇవీ చూడండి...