ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి మత్తులో కాదు.. మద్యం మత్తులో, అంధబాలికను హత్య చేశాడు : ఎస్పీ వకుల్​ - blind girl murder

SP VAKUL ZINDAL ON GIRL MURDER CASE : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంధ యువతి హత్య కేసులో జిల్లా ఎస్పీ వకుల్​ జిందాల్​ పలు కీలక విషయాలు వెల్లడించారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని తల్లి మందలించడంతో దానిని మనస్సులో పెట్టుకున్న నిందితుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు.

SP VAKUL ZINDAL ON GIRL MURDER CASE
SP VAKUL ZINDAL ON GIRL MURDER CASE

By

Published : Feb 14, 2023, 4:49 PM IST

Updated : Feb 14, 2023, 5:01 PM IST

SP VAKUL ZINDAL ON GIRL MURDER CASE : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి అంధ బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి హత్య కేసులో నిందితుడు కుక్కల రాజును పోలీసులు అరెస్ట్ చేసి.. ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ వకుల్​ జిందాల్​ పలు కీలక విషయాలు వెల్లడించారు. అంధురాలైన బాలికను హత్య చేసిన సమయంలో రాజు గంజాయి సేవించలేదని చెప్పారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని తల్లి మందలించడంతో దానిని మనస్సులో పెట్టుకున్న నిందితుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. నిందితుడు రాజుపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామని.. ఇప్పటివరకూ రాజు పై ఎలాంటి రౌడీషీట్ లేదన్నారు.

"బాలిక హత్య కేసులో విచారణ చేశాం. అతను మందుతాగి ఉన్నాడు. ఆ మత్తులోనే ఈ దారుణం చేశాడు. ఆ బాలిక తల్లి మందలించడంతో కక్ష పెంచుకున్న రాజు బాలికను హత్య చేశాడు. ఈరోజు రాజును అరెస్టు చేసి రిమాండ్​కు పంపిస్తాం. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛార్జ్​షీట్​ దాఖలు చేస్తాం. ఇతనికి శిక్ష పడేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది"-వకుల్​ జిందాల్​, జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ

అసలేం జరిగిదంటే:చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయిన ఎస్సీ బాలిక (17)పై ఓ యువకుడు గంజాయి మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నించారని కక్ష పెంచుకున్నాడు. వారింట్లోకి చొరబడి బాలికను కత్తితో విచక్షణరహితంగా నరికేశాడు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో.. తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు దగ్గరలోనే ఆదివారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి నేరచరిత్ర ఉంది. అనేక ఫిర్యాదులూ ఉన్నాయి. అయినా పోలీసుల చర్యలు లేవు. ఆ ఉదాసీనత ఫలితంగా ఓ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది. సీఎం ఇంటి చుట్టుపక్కలే గంజాయి, ఇతర మత్తుమందుల లభ్యత, విస్తృతి, భద్రతా వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనం.

బాలిక తల్లిదండ్రులు మందలీయడంతో రాజు కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గంజాయి తాగి, ఎస్తేరు రాణి ఇంటి సమీపంలోనే మకాం వేశాడు. తల్లి బయటకు వెళ్లడాన్ని గమనించి.. కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. ఒక్కసారిగా రాణిపై దాడి చేసి తలపైనా, మెడపైనా విచక్షణరహితంగా నరికేశాడు. పక్కింటి వారు కేకలు వేయడంతో పారిపోయాడు. సమాచారం అందుకున్న తల్లి వచ్చేసరికి రాణి రక్తపుమడుగులో ఉంది. వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 5.30 గంటలకు ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

అంధ బాలిక హత్య.. గంజాయి మత్తులో కాదు.. మద్యం మత్తులో

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details