రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. ఆలయం వద్ద ఉన్న భారీ రథాన్ని తనిఖీ చేశారు. రథం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించిన ఎస్పీ... అధికారులకు పలు సూచనలు చేశారు. రథంలోపలికి వెళ్లే అన్ని మార్గాల వద్ద పోలీసులను కాపలా పెట్టాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు.
దాడుల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ - గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి మంగళగిరిలో పర్యటన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
దాడుల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ