ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు మహిళలను కాపాడిన బాలనాగిరెడ్డికి ఎస్పీ సత్కారం - గుంటూరులో బాలనర్సిరెడ్డిని సత్కరించిన ఎస్పీ అమ్మిరెడ్డి

ప్రాణాలకు తెగించి కాల్వలో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను కాపాడిన వ్యక్తిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సత్కరించారు. బాల నర్సిరెడ్డి చొరవ మరెందరికో స్పూర్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

బాలనర్సిరెడ్డిని సత్కరిస్తున్న ఎస్పీ
బాలనర్సిరెడ్డిని సత్కరిస్తున్న ఎస్పీ

By

Published : Nov 23, 2020, 10:30 PM IST

కాల్వలో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను కాపాడిన వ్యక్తిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సత్కరించారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి బకింగ్ హామ్ కాలువ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు మహిళలు నీటిలో కొట్టుకుపోతుండగా వారిని బాల నర్సిరెడ్డి అనే స్థానికుడు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఓ మహిళ కాల్వలో గల్లంతైంది. బాల నర్సిరెడ్డి, తెగువ, స్పందనను ప్రశంసించిన ఎస్పీ అమ్మిరెడ్డి..అతనికి 5 వేల రూపాయల రివార్డును అందజేశారు. బాల నర్సిరెడ్డి మరెందరికో స్ఫూర్తి కావాలని ఎస్పీ అమ్మిరెడ్డి పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details