గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ సభ నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యం పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారే. వారి తాత ఈమని నుంచి వెళ్లి నెల్లూరు జిల్లాలో స్థిరపడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే బాలు మృతికి సంతాపంగా ఈ గ్రామంలో శుక్రవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గాయకులు వచ్చి బాలుతో తమకున్న అనుబంధాన్ని, ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. బాలు పాడిన పాటలతో ఆయనకు స్వర నివాళి అర్పించారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి స్వర నివాళి - emani village latest news
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభను గుంటూరు జిల్లా ఈమనిలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గాయకులు... ఆయనకు స్వర నివాళి అర్పించారు.
sp balu