కరోనాపై నిరంతర పోరులో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నగరంలోని పలుప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణ, నియంత్రణ అమలు తీరును పరిశీలించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారులకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు. డీమార్ట్ని సందర్శించిన ఎస్పీ.. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. చిరు వ్యాపారులు, మెడికల్ షాప్ యజమానులను పిలిచి పాటించవలసిన నియమాలను గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.
'కొవిడ్ నిబంధనలు పాటించకపోతే...కఠిన చర్యలు తప్పవు' - Guntur district news
గుంటూరు నగరంలోని చిరువ్యాపారులు, మెడికల్ దుకాణాల యజమానులకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్పీ అమ్మిరెడ్డి