గుంటూరు నగరంలో అమలు అవుతున్న కర్ఫ్యూను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. నగరంలోని కూరగాయల మార్కెట్ కూడలి, ఎన్టీఆర్ స్టేడియం కూడలి, గుజ్జనగుండ్ల, అరండల్ పేట ప్లై ఓవర్ వద్దనున్న చెక్ పోస్ట్ లను పరిశీలించారు. మార్కెట్ సెంటర్లలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
సరైన కారణం లేకుండా రోడ్డు పైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో అనుమతి లేకుండా ప్రయాణికులను తరలించే ప్రైవేట్ బసులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.