కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. గుంటూరు అర్బన్ పోలీసులు కర్ప్యూను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కొవిడ్ ఆంక్షల అమలు తీరుని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొవిడ్ బాధితులు పలు కారణాలతో… ఆరోగ్యంగా ఉన్న వారిని వెంట తీసుకుని ప్రయాణించటంపై ఎస్పీ దృష్టి సారించారు. దీనివల్ల మరింత వేగంగా వైరస్.. ఇతరులకు సోకే అవకాశముందని చెప్పారు.
క్షేత్రస్థాయిలో కర్ప్యూ అమలు తీరుని పరిశీలించిన ఎస్పీ అమ్మిరెడ్డి - curfew implimentation in guntur news
గుంటూరులో కర్ఫ్యూ అమలు తీరుని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండో దశలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కొవిడ్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద అంబులెన్సులు అందుబాటులో పెట్టి.. తనిఖీల్లో ఎవరైనా కొవిడ్ రోగులు తారసపడితే వారిని క్వారంటైన్‌కి తరలించాలని ఆదేశాలిచ్చారు. ఈ రోజు ఐదుగురు కరోనా పాజిటివ్ రోగులను పోలీసులు టిడ్కోకి తరలించారు. పాజిటివ్ వచ్చినవారు హోం ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్ లేదా హాస్పిటల్లో ఉండాలని సూచించారు. వివిధ కారణాలతో బయట తిరగటం వలన ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదముందని ఎస్పీ అమ్మిరెడ్డి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా