దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా గుంటూరు జిల్లాలో పర్యటించారు. మాచర్ల, నడికుడి, బెల్లంకొండ, సత్తెనపల్లి, మంగళగిరి రైల్వేస్టేషన్లో సుదుపాయాలను పరిశీలించారు. పలు చోట్ల వంతెనలు, మలుపులు, ఎల్సీ.గేట్ క్రాసింగ్ పాయింట్లను జీఎం భద్రత కోణంలో తనిఖీ చేశారు. నడికుడిలో పిల్లల పార్కు, హమాలీల విశ్రాంతి గది సిబ్బంది క్వార్టర్లను జీఎం ప్రారంభించారు.
బెల్లకొండ రైల్వే స్టేషన్లో మొక్కలు నాటారు. పలుచోట్ల ప్రయాణికులు కల్పిస్తున్న సదుపాయలు, పరిశుభ్రతకు సంబంధించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని జీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.