గుంటూరు రైల్వే డివిజన్లో సరకు రవాణా గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యింది. 2019-20లో సరకు రవాణా ద్వారా రూ. 193.4 కోట్ల ఆదాయం రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది రూ.388 కోట్లకు పెరిగినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. గతేడాది 1.55 మిలియన్ టన్నుల సరకు ఎగుమతులు చేయగా.. ఈసారి అది 2.71కు చేరింది. దీని వల్ల 93శాతం సరకుల్ని అదనంగా రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆదాయం వచ్చింది ఇలా...
ఇందులో బంగ్లాదేశ్‌కు మిర్చి రవాణా వల్ల రూ. 6.22 కోట్లు ఆదాయం వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలకు సిమెంటు, ముడిసరకు రవాణా ద్వారా రూ.47 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మిర్చితో పాటు మొక్కజొన్న, జొన్న, బియ్యం, సిమెంటు తయారీలో వాడే సున్నపురాయిని రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.