త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి - Soon welfare of every home: Home Minister
నెలరోజుల పాలనలోనే సీఎం జగన్ ప్రజాసంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారని, ఆరు నెలల కాలంలోనే పథకాలన్నీ పట్టాలెక్కుతాయని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి
త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలరోజుల్లోనే జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుని.. సంక్షేమ పథకాలను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె... రాజన్న పాలనను త్వరలోనే చూడబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పై నమ్మకంతోనే ప్రజలు 151 స్థానాలు గెలిపించారని తెలిపారు. అంతకుముందు దుగ్గిరాల మండలం మహంకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.