'అయ్యా...కొడుకా ఆకలి అవుంతుంది అన్నం పెట్టండి... చలేస్తుంది అయ్యా దుప్పటి కావాలి.. నా కొడుకులు నన్నొదిలేశారు.. నాకన్నం పెట్టండయ్యా..' - కొడుకులు వదిలేసిన తల్లి ఆవేదన ఇది
కన్న కొడుకులు ఉండి కూడా ఆ తల్లి రోడ్డు మీద పడింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు బస్ షెల్టర్లో... ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలు దీనంగా పడి ఉంది. గ్రామంలో వచ్చే పోయేవారిని చూసి... కొడుకా ఆకలి అవుతుంది అన్నం పెట్టు...అంటూ ఏడుస్తోంది. ఆ తల్లి దీన స్థితి చూసి స్థానికులు ఆమె ఆకలి తీరుస్తున్నారు. ముగ్గురు కుమారులు ఉన్నారని రెండు రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లారని ఆమె చెప్తూ కన్నీటి పర్యాంతమైంది.