కరోనా సోకిందని తల్లిని రోడ్డుపై వదిలేసిన తనయుడు - గుంటూరులో తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు
12:46 July 02
మానవత్వం మరిచాడు... తల్లిని రోడ్డుపై వదిలేశాడు
తన తల్లికి కరోనా పాజిటివ్ ఉందని తెలుసుకున్న కుమారుడు... రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.
మాచర్లకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తన తల్లికి కరోనా ఉందని తెలిసి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లాడు. సమాచారం అందుకున్న మాచర్ల తహసీల్దార్ వెంకయ్య, కమిషనర్ గిరి కుమార్, ఎస్సై మోహన్ ఘటన స్థలానికి చేరుకున్నారు. భాదితురాలిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన కుమారుడు వెంకటేష్ పై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.