ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగొచ్చాడని తండ్రిన చంపేసిన కొడుకు - గుంటూరు క్రైమ్ న్యూస్

మగబిడ్డ జన్మించాడని ఆనందపడ్డాడు. బిడ్డ ముసి మూసి నవులు నవ్వుతుంటే.. గుండెల మీద కూర్చోపెట్టుకొని మురిసి పోయాడు. అండగా ఉంటాడనుకున్న.. అదే కొడుకు.. తాగొచ్చాడని తండ్రిని చంపేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జరిగింది.

son killed his father in gunturu
son killed his father in gunturu

By

Published : Sep 8, 2020, 12:50 AM IST

గుంటూరు జిల్లా వేలూరిపాడుకు చెందిన షేక్ షరీఫ్, గౌస్య దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు ఆటో నడుపుతుంటాడు. గౌస్య ఇంటి ముందు చిల్లర దుకాణం నడుపుతుంటుంది. షరీఫ్ మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 5వ తేదీ షరీఫ్ మందు తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. కుటుంబ సభ్యులు మందలించినా.. షరీఫ్ ఊరుకోలేదు. వారిని తిడుతూ ఇంటి ముందు ఉన్న కొడుకు ఆటో అద్దం పగలకొట్టాడు. కోపంతో రఫీ తన తండ్రి షరీఫ్​పై చేయి చేసుకున్నాడు. షరీఫ్ గాయపడ్డాడు.

చికిత్స నిమిత్తం బాధితుడిని మరుసటి రోజు ఫిరంగిపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ షరీఫ్ (40) ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫిరంగిపురం ఏస్ఐ సురేశ్ తన సిబ్బందితో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:అంతర్వేది రథం దగ్ధం ఘటన: ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details