బాలుడు కిడ్నాప్... తండ్రే సూత్రధారి..! కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడిని గుంటూరు రూరల్ పోలీసులు సురక్షితంగా రక్షించి... తల్లికి అప్పగించారు. కన్న తండ్రే డబ్బు కోసం కొడుకును కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసిందని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శాగలంపూడి గాంధీ కుమారుడు... సంతోష్ 5 నెలల బాలుడు. 28న రాత్రి కిడ్నాప్‌కు గురయ్యాడు. సంతోషకుమార్ను కిడ్నాప్ చేసిన దుండగులు గాంధీ అన్న శివకు ఫోన్ చేసి... తన తమ్ముడి కొడుకును కిడ్నాప్ చేశామని... బాలుడిని చంపకుండా ఉండాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శివ తన తమ్ముడి కొడుకును కిడ్నాప్ చేశారని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కాల్ ట్రేజ్ చేశారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల సమీపంలో కిడ్నాపర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు... నిందితులను అరెస్టు చేసి బాలుడిని రక్షించారు.
డబ్బు కోసం బాలుడి తండ్రే మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి... కిడ్నాప్ చేసినట్టు తేలిందన్నారు. బాలుడి కిడ్నాప్‌కి ప్లాన్ చేసిన తండ్రి గాంధీతో పాటు కిడ్నాప్‌కు సహకరించిన మౌలాలీ, దౌలా, సాంబయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.
ఇవీ చదవండి...కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు