భర్త చనిపోతే అన్నీతానై అల్లారుముద్దుగా పెంచిన కొడుకు నిరాదరణతో ఆ అమ్మ హృదయం తల్లడిల్లిపోతోంది. కన్నతల్లి అనారోగ్యంతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుందని తెలిసినా ఆ కుమారుడు చూసేందుకు ఇష్టపడని సంఘటన అందరి గుండెలను పిండేస్తోంది. వివరాలు.. ప్రత్తిపాడుకు చెందిన మాదిపల్లి మాణిక్యమ్మకు ఒక్కగానొక్క కొడుకు సురేష్. ఆరేళ్ల క్రితం భర్త చనిపోతే బిడ్డను ఎంతో ప్రేమతో పెంచింది. తల్లికి చేదోడుగా ఉండే అతడు మూడేళ్ల క్రితం ఎస్టీ వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
చావుబతుకుల మధ్య తల్లి.. చూసేందుకు ఇష్టపడని కొడుకు - గుంటూరు తాజా వార్తలు
కన్నతల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ కుమారుడు చూసేందుకు ఇష్టపడడం లేదు. ఆ మాతృమూర్తి పదేపదే కన్నకొడుకు పేరును కలవరిస్తూ... కన్నీళ్లు పెట్టుకోవడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.
ఆనాటి నుంచి అమ్మకు మొహం చాటేశాడు. ఇటీవల మాణిక్యమ్మ అనారోగ్యం బారినపడ్డారు. మంచంపై ఆక్సిజన్ సిలిండర్ సాయంతో కష్టంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆమె బంధువులు సురేష్‌కు విషయం తెలిపినా పట్టించుకోలేదు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఆందోళనకు గురైన అతడు శానిటైజరు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా స్వస్థత పొంది తన ఇంటికి వచ్చేశాడు. కన్నతల్లి తన బిడ్డ కావాలంటూ కలవరించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చూడండి:Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!