గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన తండ్రిపై బీర్ బాటిల్తో దాడికి పాల్పడ్డాడు. నగరంలోని శారదకాలనీకి చెందిన బాలశౌరి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గత రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తనకు ఇంకా మద్యం కావాలని.., డబ్బు ఇవ్వాలని తండ్రి ఏసుబాబుతో గొడవకు దిగాడు. తన వద్ద డబ్బులు లేవని ఏసుబాబు చెప్పటంతో కోపోద్రిక్తుడైన బాలశౌరి..చేతిలో ఉన్న బీరు బాటిల్తో అతని తల, పొట్ట భాగంలో గాయపరిచాడు. బాధితుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బీర్ బాటిల్తో తండ్రిపై కుమారుడి దాడి - బీర్ బాటిల్తో తండ్రిపై కుమారుడి దాడి న్యూస్
మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన తండ్రిపై బీర్ బాటిల్తో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం గుంటూరు నగరంలో చోటుచేసుకోగా..ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బీర్ బాటిల్తో తండ్రిపై కుమారుడి దాడి