వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత భాజపాకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలరా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ అంబటి నవకుమార్ తన అనుచరులతో కలిసి భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి సోము వీర్రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
'రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలరా ?' - సోము వీర్రాజు న్యూస్
భాజాపా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలరా
రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పల్నాడులో కోట్ల విలువైన గనులున్నాయని సోము స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పాలించిన నాయకులు గనులను కొల్లగొట్టి ఆస్తులను వెనకేసుకున్నారని ఆక్షేపించారు. ఇవి రాష్ట్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి, యువతకు విద్యావకాశాలు కల్పించడానికి ఉపయోగపడాలన్నారు.పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపే శక్తి ఒక్క భాజపాకే ఉందన్నారు.
ఇదీచదవండి: ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ