నేతలు, కార్యకర్తల అండతో పార్టీనీ బలోపేతం చేస్తానని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: సోము వీర్రాజు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
![రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: సోము వీర్రాజు mlc somu verraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8203187-53-8203187-1595928525528.jpg)
మ్మెల్సీ సోము వీర్రాజు
పార్టీ పెద్దలు కట్టబెట్టిన బాధ్యతను మనసా వాచా కర్మణా నిబద్ధతో నిర్వహిస్తామని అన్నారు. పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తాననీ.. ఈ క్రమంలో అందర్నీ కలుపుకుంటూ, పార్టీని ముందుకు తీసుకువెళ్లటానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:శిరోముండనం వ్యవహారం: వరప్రసాద్‌కు చంద్రబాబు రూ.2లక్షల సాయం