గుంటూరులోని నెహ్రూనగర్‌లో భాజపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఆయన సమక్షంలో స్థానిక నాయకులు పార్టీలో చేరారు.
మైనార్టీల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కేంద్రం చేస్తున్నదేనని వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులతోనే గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. భాజపా, జనసేన కార్యకర్తలు ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.