Some Other IAS Transfers In AP : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా.. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి విదితమే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.విజయానంద్‌కు ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. సర్వ శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్. సురేష్ కుమార్‌ను బదిలీ చేసి.. ఆ స్థానంలో బి. శ్రీనివాసరావును నియమించింది.
ఐఏఎస్ అధికారి వెట్రిసెల్విని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపేసింది. ప్రసవ సెలవుపై వెళ్లిన నారపురెడ్డి మౌర్యను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న హరితను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో వికాస్ మర్మత్‌ను నియమించింది. బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీ (విజిలెన్స్)గా వ్యవహరిస్తున్న చామకూరి శ్రీధర్‌ను నియమించింది. బాపట్ల జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లా జేసీగా నియమించింది.
బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే.. మరోసారి బదిలీ: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన వికాస్ మర్మత్ నేడు మరోసారి బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వికాస్ మర్మత్‌ను నియమించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామసుందర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పదవీ భాద్యతలు తీసుకున్న రోజే బదిలీ చెయ్యడం గమనార్హం. తాజాగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నారపు రెడ్డి మౌర్యను నియమించారు.