312 రోజులుగా శాంతియుతంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఇటీవల అరెస్టయిన కృష్ణాయపాలెంకు చెందిన రైతులను నరసరావుపేట సబ్ జైలు నుంచి గుంటూరులోని జిల్లా జైలుకు అధికారులు మంగళవారం తరలించారు.
'అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నం' - Guntur district latest news
అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నరసరావుపేట సబ్ జైలులో కృష్ణాయపాలెంకు చెందిన రైతులను ఆయన పరామర్శించారు.

cpi nageswara rao
అంతకుముందు నరసరావుపేట సబ్ జైలులో రైతులను ముప్పాళ్ల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... అమరావతి రైతులు ఎక్కడా సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు చిన్నపాటి ఒడిదొడుకులు సహజమేనని నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు దుయ్యబట్టారు.