ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుమర్రులో అక్రమంగా మట్టి తవ్వకాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా పెనుమర్రు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి అండతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పెనుమర్రులో అక్రమ మట్టి తవ్వకాలు
పెనుమర్రులో అక్రమ మట్టి తవ్వకాలు

By

Published : Jan 27, 2021, 12:26 PM IST

గుంటూరు జిల్లా వేమూరు మండలం పెనుమర్రు గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రోడ్లలో మట్టిని కూడా అక్రమార్కులు వదలడం లేదు. ఇక్కడ అక్రమంగా తవ్వుతూ.. ట్రాక్టర్ల ద్వారా భట్టిప్రోలు, కొల్లూరు, రావికంపాడు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఓ ప్రజాప్రతినిధి అండతో ఈ వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. అందుకే పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. కనీసం మాట్లాడేందుకూ వెనుకంజ వేస్తున్నారని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details