పులిచింతల ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు.. స్టాప్ లాక్ ఏర్పాటుకు సన్నాహాలు.. - పులిచింతల ప్రాజెక్టు గేటు ఏర్పాటు
పులిచింతల ప్రాజెక్టు విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులో ప్రస్తుతం 13.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10 టీఎంసీలకు తగ్గాకే పనులు ప్రారంభించడానికి అవకాశం ఉండటంతో... స్టాప్ లాక్ ఏర్పాటుకు అవసరమైన ఇనుప సెగ్మెంట్లను ఇంజినీరింగ్ నిపుణులు సిద్ధం చేస్తున్నారు. పులిచింతల గేటు విరిగిపోయిన ప్రాంతంలో అధికారులు ఏం చేయబోతున్నారు?, స్టాప్ లాక్ ఏర్పాటు ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది?.. మొత్తం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనే అంశాలపై... పులిచింతల పర్యవేక్షక ఇంజినీరు రమేష్ బాబుతో... ఈ టీవీ భారత్ ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.
soft lockd gate going to organize for pulichinthala project