ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోషలిస్టు నేత గుంటుపల్లి వెంకటేశ్వరరావు కన్నుమూత - గుంటూరు జిల్లా వార్తలు

సోషలిస్టు నేత, భారత్‌ సేవక్‌ సమాజ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుంటుపల్లి వెంకటేశ్వరరావు (90) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Venkateshwara rao
Venkateshwara rao

By

Published : Nov 30, 2020, 10:04 AM IST

ప్రముఖ సోషలిస్టు నేత, భారత్‌ సేవక్‌ సమాజ్‌ రాష్ట్ర మాజీఅధ్యక్షుడు గుంటుపల్లి వెంకటేశ్వరరావు (90) ఆదివారం రాత్రి కన్నుమూశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌, సోషలిస్టు నేత జయప్రకాష్‌ నారాయణ, ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఎన్‌.డి.తివారీ, రాష్ట్రానికి చెందిన పి.వి.జి.రాజులకు వెంకటేశ్వరరావు అనుచరుడు. మాజీ ముఖ్యమంత్రి దివంగత భవనం వెంకట్రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడు.

గుంటూరు జిల్లాలో ఆయన భారత్‌ సేవక్‌ సమాజ్‌ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. సోమవారం పెదగొట్టిపాడులో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు తెదేపా నేత భుజంగరాయలు తెలిపారు.

ఇదీ చదవండి:నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన

ABOUT THE AUTHOR

...view details