ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగులచవితి రోజున ఆసక్తికర ఘటన - Guntur district latest news

నాగులచవితి రోజున పుట్టలో పాలు పోయడానికి వెళ్లిన భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది. పుట్ట నుంచి బయటకు వచ్చి భక్తులు సమర్పించిన కోడి గుడ్డును మింగేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

snake video
snake video

By

Published : Nov 18, 2020, 11:15 PM IST

నాగులచవితి రోజున ఆసక్తికర ఘటన

నాగులచవితి పర్వదినాన గుంటూరు జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. నాగు పాము కోడి గుడ్డుని ఆరగించగా... ఆ దృశ్యాలను భక్తులు చరవాణిలో బంధించారు. కొల్లూరు మండలం తూములూరులో నాగులచవితి సందర్భంగా భక్తులు పాము పుట్ట వద్ద పూజలు నిర్వహించారు.

పుట్టలో పాలు పోయటంతో పాటు కొందరు భక్తులు కోడిగుడ్లు కూడా వేశారు. భక్తుల సందడి కాస్త తగ్గాక బయటకు వచ్చిన పాము... గుడ్డును మింగేసింది. మొదట భయపడిన భక్తులు... ఆ తరువాత ఆసక్తిగా తిలకించారు. తమ కోర్కెలు తీరాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details