అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 29 కేజీల గంజాయి, 6 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని విశాఖ జిల్లాలో కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైలు మార్గం ద్వారా తరలింపు
విశాఖ జిల్లా హుకుంపేట ప్రాంతంలో రూ. 1.10 లక్షలు వెచ్చించి నిందితులు 29 కేజీల 100 గ్రాముల గంజాయిని నిందితులు పవన్ కుమార్ , అఖిల్ , వెంకట రవితేజ , నాగరాజులు కొనుగోలు చేశారు. కారులో వెళ్లిన నలుగురిలో పవన్ కుమార్, అఖిల్‌లు గంజాయిని రైలులో అనంతపురం తీసుకొచ్చారు. స్థానిక రాచనపల్లి గ్రామంలో డంప్ చేసి కిలో రూ. 15 వేల చొప్పున విక్రయించాలని భావించారు. కొనుగోలుదారులు సునీల్, ధన్‌రాజ్‌లను వెంట తీసుకెళ్తున్న ముఠాను స్థానిక బళ్ళారి రోడ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా..ఆరుగురు అరెస్టు - గంజాయి అక్రమ రవాణా న్యూస్
అక్రమంగా గంజాయి రవాణా చేస్తన్న ఆరుగురు సభ్యులు గల ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 29 కేజీల గంజాయి, 6 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా
ఇదీచదవండి