ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి హత్య - Bhargavateja missing in Guntur

ఆడుకుంటున్న పసివాడు అదృశ్యమయ్యాడు. రోజు గడిచేలోపే శవంగా మారాడు. ఆరేళ్ల చిన్నారి అని కూడా చూడలేదు. ఆగంతుకులు అమానుషంగా ఉసురు తీశారు. ముద్దులొలికే కుమారుడి జాడ కోసం ఎక్కడెక్కడో గాలిస్తున్న తల్లిదండ్రులకు... చివరికి గుండెకోతే మిగిలింది. పసివాడి హత్య పోలీసులకు సవాల్‌గా మారింది. నేరస్థులెవరు, పసివాడిపై పైశాచికం ఏంటనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి హత్య
అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి హత్య

By

Published : Mar 16, 2021, 5:15 AM IST

Updated : Mar 16, 2021, 5:51 AM IST

అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి హత్య

అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడు చివరికి విగతజీవిగా మారి, హృదయ విదారక స్థితిలో కనిపించిన ఘటన... గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. తాడేపల్లి మండలం మెల్లెంపూడికి చెందిన భార్గవతేజ... ఆదివారం ఆడుకుంటూ ఉండగానే అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు, బంధువులు ఊరూవాడా గాలిస్తుండగానే... సమీపంలోని పొలాల్లో మృతదేహం లభ్యమైంది. బాలుడి ముఖంపై తీవ్రమైన గాయాలు, చేతి వేళ్ళు, కాళ్లు విరిచేసినట్లు ఉన్న ఆనవాళ్లు అందరినీ ఆవేదనకు గురిచేశాయి.

కనిపించకుండా పోయిన కుమారుడు తిరిగి క్షేమంగా రావాలని ఎదురుచూసిన తల్లిదండ్రులు... ఈ వార్త విని కుప్పకూలిపోయారు. నిత్యం హుషారుగా తిరిగే భార్గవ్‌తేజ విషాదాంతంపై గ్రామస్థులు సైతం కన్నీరుపెట్టారు.

నిందితులు ఎలాంటి ఆధారాలూ దొరక్కుండా పక్కాగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును సవాల్‌గా తీసుకుని.... భార్గవతేజ్‌ హత్యకు దారితీసిన పరిస్థితులేంటి, ఆర్థిక లావాదేవీలే కారణమా, ఇంకేమైనా అంశాలున్నాయా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక రాగానే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవీ చదవండి

అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!

Last Updated : Mar 16, 2021, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details