ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొప్పురావూరు హత్య కేసు ఛేదన... ఆరుగురు అరెస్టు - guntur district crime

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో యువకుడి హత్య కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.

six people arrested in koppuravooru murder case
కొప్పురావూరు హత్య కేసు ఛేదన

By

Published : Apr 30, 2021, 4:17 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన విన్నకోట కుమారి, శివకోటేశ్వరరావు దంపతుల కుమారుడు విన్నకోట వెంకటేష్... కార్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి, ఆమె బంధువులు వెంకటేష్​ను హెచ్చరించారు.

ముందస్తు పథకం ప్రకారం...

ఈ క్రమంలో యువతి సోదరుడైన మణితేజను అడ్డు తొలగించుకోవాలని వెంకటేష్ ప్రయత్నించినట్లు యువతి తండ్రికి తెలిసింది. దీంతో ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్​ను ఈ నెల 27న రాత్రి 8.30గం.లకు భరత్ కుమార్ అనే యువకుడి ద్వారా కొప్పురావూరుకు పిలిపించారు. అనంతరం వెంకటేష్​పై ఆరుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా కాళ్లు, చేతులు నరికారు. విషయం తెలుసుకున్న వెంకటేష్ కుటుంబసభ్యులు వెంకటేష్​ను జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందాడు.

మారణాయుధాలు స్వాధీనం...

ఈ ఘటనపై మృతుడి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు మంగళగిరి ఉత్తర ఎస్​డీపీఓ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో పెదకాకాని ఇన్​స్పెక్టర్​ యు.శోభన్​బాబు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో వెంకటేష్​ను హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొట్టేభాస్కర్ రావు (ఏ1), కొట్టే దుర్గారావు (ఏ2), కొట్టే మోహన్ (ఏ3), కొట్టే వెంకట గోపీ (ఏ4), కొట్టే వైష్ణవ మణితేజ (ఏ5), తోట భరత్ కుమార్ (ఏ6) లుగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, కారం పొడి ప్యాకెట్లు, మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీచదవండి.

కరోనా సమయంలో పరీక్షలు పెట్టడమేంటి?: హైకోర్టు న్యాయవాది

కరోనాతో బిహార్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృతి

ABOUT THE AUTHOR

...view details