ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే విడదల రజనీ బంధువుపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు - six members arrested in vidadhala rajani brother in law case

గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మరిది గోపీపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని.. 18 మందిని విచారిస్తున్నామని స్థానిక సీఐ తెలిపారు.

six members arrested in vidadhala  rajani brother in law case
చిలకలూరిపేట ప్రభల యాత్రలో దాడి కేసులో ఆరుగురి అరెస్టు

By

Published : Feb 25, 2020, 5:35 PM IST

చిలకలూరిపేట ప్రభల యాత్రలో దాడి కేసులో ఆరుగురి అరెస్టు

గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మరిది గోపీపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని సీఐ సూర్యనారాయణ తెలిపారు. మిగిలిన 18 మందిని విచారిస్తున్నామన్నారు.

ఈ నెల 19న చిలకలూరిపేట పురషోత్తమపట్నంలో బైరా వారి ప్రభు వద్దకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే మరిది విడదల గోపీ ఎంపీ కారుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నెల 20న గోపీ కారుకు కొంతమంది ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి చంపాలని ప్రయత్నించారని సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఆ దాడిలో విడదల గోపి, బలరాం అనే వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:
వైకాపాలో విభేదాలు: ఎంపీ కారును అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details