గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఏరువాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ విధానంలో ఇసుక కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి మద్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
గుంటూరు జిల్లాలో ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత - చిలకలూరి పేట నేర వార్తలు
గుంటూరు జిల్లా ఏరువాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఆరు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత