గుంటూరు : అక్కను హత్య చేసిన తమ్ముడు.. భార్యపై దాడి చేస్తుండగా ఘటన - guntur latest news
11:14 December 12
పరారీలోని నిందితుడు ఏసు కోసం పోలీసుల గాలింపు
Murder in Guntur : గుంటూరు మారుతీనగర్ రెండో లైన్లో నివాసం ఉండే కావూరి ఏసు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆమెకు భార్య, కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏసు గాయపడ్డాడు. చికిత్స కోసం ఏసు భార్య.. తెలిసిన వారి దగ్గర నుంచి డబ్బు తీసుకువచ్చి వైద్యం చేయించింది. నయమై ఇంటికి వెళ్లిన తర్వాత ఏసు డబ్బు విషయమై తన భార్యతో నిత్యం ఘర్షణ పడుతుండేవాడు.
ఈ క్రమంలోనే.. ఈరోజు ఉదయం గొడవ జరుగుతుండగా ఏసు సోదరి మహాలక్ష్మి.. అడ్డుకునేందుకు వెళ్లింది. కోపోద్రిక్తుడైన ఏసు.. అడ్డు వచ్చిన తన సోదరి మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం భార్యనూ చంపేందుకు ప్రయత్నించగా.. ఆమె అరవడంతో స్థానికులు వచ్చారు. వెంటనే నిందితుడు ఏసు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీచదవండి.