ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింధూ కేసు మరో మలుపు...ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ! - సింధూ కేసు మరో మలుపు...ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సై జగదీశ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సింధూ కేసు మరో మలుపు తిరిగింది. సింధూ 2013లో తన వద్ద బంగారం తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసింది.

సింధూ కేసు మరో మలుపు...ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ !
సింధూ కేసు మరో మలుపు...ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ !

By

Published : Jul 6, 2020, 10:31 PM IST

గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సై జగదీశ్​పై సంచలన ఆరోపణలు చేసిన సింధు కేసు మరో మలుపు తిరిగింది. సింధూ 2013లో తన వద్ద బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై తాను అప్పటి డీఎస్పీకి ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని, తిరిగి తమపై సింధూతో కలిసి తప్పుడు కేసులు పెట్టారని మహిళ ఆరోపించింది. తన వద్ద బంగారం తీసుకున్నది నిజమేనని సింధూ భర్త సుబ్బారావు కూడా అంగీకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తన బంగారం ఇప్పించాలని నరసరావుపేట డీఎస్పీని వేడుకొన్నారు.

ఇటీవలే ఎస్ఐ జగదీశ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని సింధూ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమె వ్యవహార శైలిని మొదటి భర్త సుబ్బారావు తప్పుపట్టారు. తాజాగా సింధూ వైఖరిపై మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తుండటంతో వ్యవహారం మలుపు తిరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details