ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెండి ఆభరణాల తయారీ కార్మికుడిపై యజమాని దాడి - silver shop owner attack on worker at tenali

గుంటూరు జిల్లా తెనాలిలో వెండి ఆభరణాల తయారీ కార్మికుడు గణేష్ పై... అతని యజమాని సుధీర్ దాడికి పాల్పడ్డాడు. సుధీర్ దుకాణంలో రెండు కిలోల వెండి అపహరణకు గురికావటంతో.. గణేష్ ఆ పని చేసుంటాడనే అనుమానంతో అతడిని చితకబాదారు. బాధితునిపై దాడిని వెండి బట్టి అసోసియేషన్ నాయకులు ఖండించారు. బతుకుదెరువు కోసం వచ్చిన వారిని ఇలా హింసించటం సరికాదని... దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

silver shop owner attack on worker
వెండి ఆభరణాల తయారీ కార్మికుడిపై యజమాని దాడి

By

Published : Nov 24, 2020, 8:30 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో వెండి ఆభరణాల తయారీ కార్మికుడు గణేష్ పై యజమాని సుధీర్ దాడి చేశాడు. మహారాష్ట్రకు చెందిన గణేష్ బతుకుదెరువు కోసం వచ్చి... తెనాలిలో వెండి బట్టి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను పనిచేస్తున్న షాపులో రెండు కిలోల వెండి చోరీకి గురికావటంతో యజమాని సుధీర్.... ఆ దొంగతనం గణేష్ చేశాడనే అనుమానంతో నిర్భందించాడు. మరో 8మందితో కలిసి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ గణేష్ ను ఇష్టారాజ్యంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తనపై జరిగిన దాడి విషయాన్ని బాధితుడు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గణేష్ పై దాడిని వెండి బట్టి అసోసియేషన్ నాయకులు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గాని... ఇలా దాడి చేయటం ఏమిటని ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారిని హింసించటం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details