Sikh Religious Leaders Meet CM Jagan: రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తనను కలిసిన సిక్కు నేతలకు సీఎం వరాలు కురిపించారు. మైనార్టీ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు. మైనార్టీ నేతల విన్నపాలకు సీఎం సానుకులంగా స్పందించారు. పది రోజుల్లోగా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను సిక్కు పెద్దలు కోరారు. వారి విన్నపానికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గురుద్వారాల్లోని గ్రంధీలకు పూజారుల మాదిరిగా లబ్ధి చేకూర్చెేందుకు ప్రయత్నిస్తానని సీఎం జగన్ తెలిపారు.
సిక్కులకు సైతంనవరత్నాల అమలు చేయాలని విజ్ఞప్తి: రాష్ట్రంలో నివసించే సిక్కులకు నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సిక్కు పెద్దలు కోరిన మేరకు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్ సింగ్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సీఎం అంగీకరించారు. గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.