గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమైన 5 ద్విచక్రవాహనాలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.సురేష్‌బాబు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహానాలు గుర్తించి సీజ్ చేశారు. వాహనదారులపై రూ. 20 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా.. వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అధికంగా శబ్దం చేస్తున్న వాహనాలు సీజ్
అధికంగా శబ్దం చేస్తూ.. రోడ్లపై భయాందోళనలకు గురిచేస్తున్న 5 ద్విచక్రవాహనాలను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. ఆ వాహనదారులకు జరిమానా విధించినట్టు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎం.సురేష్‌బాబు చెప్పారు.
అధికంగా శబ్దం చేస్తున్న వాహనాలు సీజ్