గుంటూరు జిల్లాలో పోలీసుల వివాహేతర సంబంధాల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అరండల్ పేట ఎస్సై బాలకృష్ణ, నగరంపాలెం సీఐ వెంకటరెడ్డి ఘటనలు మరువక ముందే మరో ఎస్సై వివాహేతర సంబంధం కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. గుంటూరులోని పట్టాభిపురం, తెనాలి, పెదకాకాని పోలీస్స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన వెంకట కృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనని వేధిస్తున్నాడని అతని భార్య గుంటూరు గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 2014 నుంచి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని దీనిపై 2017లో తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. అయిన్పటికీ ఇప్పటి వరకు ఎస్సై వెంకటకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయింది. అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. ఎస్సై వెంకటకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది. పోలీసు శాఖలోని కొంతమంది ఎస్సైకి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎస్సై వెంకటకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో పనిచేస్తున్నాడని చెప్పింది.
ఎస్సై వక్రబుద్ధి... భార్యను హింసిస్తూ వేరే మహిళతో రాసలీలలు - ఎస్సై వివాహేతర సంబంధం
అతను ఓ ఎస్సై. తప్పు చేసిన వారిని దండించాల్సిన అతనే దారి తప్పాడు. వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్యను హింసిస్తున్నాడు. తనను దూరం పెట్టి మరో యువతిని వివాహమాడాడని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
si illegal affair came into light after his wife complaint to police