ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చికిత్స పొందుతూ మహిళా ఎస్సై మృతి - చుండూరు మహిళా ఎస్సై మృతి

మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన చుండూరు ఎస్సై శ్రావణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు ఓ పోలీసు ఉన్నతాధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది.

si died in gunur
si died in gunur

By

Published : May 12, 2021, 11:43 AM IST

గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు రోజుల కింద‌ట ఈమె పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యకు యత్నించారు. శ్రావ‌ణి స్వగ్రామం ప్ర‌కాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వ‌ర్తించే ఈమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. శ్రావణి మృతికి ఓ పోలీసు అధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది. 2018 బ్యాచ్​కు చెందిన ఆమె నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్​లో మొదటి పోస్టింగ్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details